Godavari: ప్రెస్ నోట్: "UTK" లా భార‌త్‌లోకి అడుగుపెడుతున్న అమెరికా 'గోదావ‌రి'

Godavari Flows to India as UTK

  • ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ద‌క్షిణ భార‌త రెస్టారెంట్ సంస్థ ``గోదావ‌రి గ్రూప్‌``
  • విజ‌య‌వాడ న‌గ‌రంలో తొలి సంస్థ‌ ప్రారంభం
  •  ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన `గోదావ‌రి గ్రూప్`

ప్రెస్ నోట్: ప్ర‌పంచ ప్ర‌సిద్ధ ద‌క్షిణ భార‌త రెస్టారెంట్ సంస్థ ``గోదావ‌రి గ్రూప్‌`` ప్ర‌స్తుతం అమెరికా, కెన‌డాల్లో భార‌తీయుల‌కు ప‌సందైన వంట‌కాలు రుచి చూపిస్తోంది. అమెరికాలోని బోస్ట‌న్‌లో ఉన్న ఈ సంస్థ తాజాగా భార‌త్‌కు కూడా విస్త‌రించింది. గోదావ‌రి ప్ర‌వాహం మాదిరిగా.. త‌న శాఖ‌ల‌ను విస్త‌రిస్తోంది. United Telugu Kitchens (UTK) `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` UTK.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో త‌న తొలి సంస్థ‌ను ప్రారంభించింది. ఈ మేర‌కు `గోదావ‌రి గ్రూప్` ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
 
ఈ రెస్టారెంట్ ద్వారా రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లోని ప్ర‌సిద్ధ వంట‌కాల‌ను ఒకే గొడుగు కింద అందించ‌నున్నారు. నిపుణులైన చెఫ్‌ల‌తో ఆయా వంట‌కాల‌ను ఆహార‌ ప్రియుల‌కు అందించాల‌నే ఆలోచ‌న‌తో UTK విజ‌య‌వాడ‌ను ఎంచుకోవ‌డం విశేషం.
 
తెలంగాణ వంటకాల నుంచి దట్టమైన, సంక్లిష్టమైన మసాలాలతో నిండిన ఆంధ్ర, రాయలసీమ వంటకాల వరకు ఎంతో రుచిక‌ర‌మైన వంట‌ల‌ను విజయవాడలోని "UTK``లో అందుబాటులో తీసుకురానున్నారు. 
 
"UTK" ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఆహార ప్రియుల నోళ్ల‌ను ఊరిస్తోంది. ఇది ఆధునిక శైలితో కూడిన ప్రత్యేక  తెలుగు వంటకాలతో భారతీయ‌ సంస్కృతిని గొప్పగా చాటేలా ఆహార ప్రియుల‌ను ఆక‌ట్టుకోనుంది.
 
“UTK”  మొత్తం 8 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీనిలో `క‌లువ‌` (KALUVA) పేరుతో చిన్న‌పాటి స‌మావేశ మందిరం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. గోదావరి చైన్ ఆఫ్ రెస్టారెంట్స్‌కి భారతీయ వెర్షన్‌ను జోడించి.. ఆహార ప్రియుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేయ‌నుంది.
 
UTKను ఆకర్షణీయమైన వాతావరణంలో ఏర్పాటు చేయ‌డం వెనుక‌ వ్యవస్థాపకులు చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇంటీరియర్ డెక‌రేష‌న్ లో ఆధునిక‌త‌, సంప్రదాయం వంటివాటిని మేళ‌వించి ఏర్పాటు చేయ‌డంతో ఇది ప్ర‌పంచ‌స్థాయి డిజైన్‌కు స‌రిస‌మానంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.
 
రెస్టారెంట్  మస్కట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. 10 అడుగుల బుల్ ఫేస్ (గంగిరెద్దు) చెక్కబడింది, దీనిని తెలంగాణకు చెందిన ప్రసిద్ధ శిల్పి ``రంగ‌" రూపొందించారు.
 
United Telugu Kitchens (UTK) యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)తో క‌లిసి ప‌నిచేసేందుకు కొత్త తరం మహిళా ఆహార వ్యాపారవేత్త తేజి పిన్నమమేని ముందుకు రావ‌డంగ‌మ‌నార్హం.  ఆహారంలో అభిరుచి, నైపుణ్యం తేజి సొంతం. తేజి భాగ‌స్వామ్యం వెను గోదావరి గ్రూప్ వ్యవస్థాపకులు కౌశిక్ కోగంటి, తేజా చేకూరిల కృషి ఉండ‌డం గ‌మ‌నార్హం.
 
ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌స్థాప‌కులు కౌశిక్ కోగంటి మాట్లాడుతూ.. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)ను దేశ‌వ్యాప్తంగా.. అన్నిరాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేయ‌డానికి ఉన్న అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు చెప్పారు. తెలుగు వంట‌కాల రుచుల‌ను దేశం మొత్తానికి అందించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.
 
`మ‌న భాష‌, మ‌న భోజ‌నం` త‌ర‌హాలో స‌రిహ‌ద్దుల‌ను చెరిపేసి.. యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
 
ఫుడ్ (Food) గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి (CLICK HERE!!).  
 
ఆసక్తి ఉన్న వారు టీమ్ లో చేరవచ్చు లేదా ఫ్రాంచైజీ పై ఆసక్తి ఉంటే [email protected] ను క్లిక్ చేసి మరిన్ని వివరాలు పొందవచ్చు.
 
For Location Details: 
United Telugu Kitchens (UTK)
Opp Mother Teresa Statue, Siddartha Nagar, 
Vijayawada, AP, INDIA 520010.
 
ఈ వారాంతంలో “యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK)”కు రండి...మా ప్రత్యేక వంటకాలు, రుచులను ఆస్వాదించండి...రండి అందరం కలిసి పండుగ చేసుకుందాం.
 
సదామీసేవ‌లో…..
 
https://unitedtelugukitchens.com/
 
Content Produced by: Indian Clicks, LLC

  • Loading...

More Telugu News