rain: తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వ‌ర్షాలు

rains in telangana

  • హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్ర‌క‌ట‌న‌
  • క్యుములోనింబస్ ప్ర‌భావంతో ప‌లు ప్రాంతాల్లో కుంభవృష్టి ప‌డే ఛాన్స్
  • తెలంగాణ‌లో త‌గ్గిన‌ ఉష్ణోగ్ర‌త‌లు

తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ ప్ర‌భావంతో తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో కుంభవృష్టి పడుతుందని వివ‌రించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొన‌సాగుతోంది. 

కర్ణాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. తెలంగాణ‌లోని వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో నిన్న కూడా వర్షాలు కురిశాయి. తెలంగాణ‌లో ఉష్ణోగ్ర‌త‌లు కాస్త త‌గ్గాయి. ఉపరితల ద్రోణి గాలులతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు తక్కువగా ఉంటుందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వివ‌రించారు.

  • Loading...

More Telugu News