India: దేశంలో కొత్తగా 2,226 క‌రోనా కేసులు

India reports 2226 fresh cases today Active caseload at 14955
  • 14,955 యాక్టివ్ కేసులు
  • నిన్న కోలుకున్న‌ 2,202 మంది 
  • కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,25,97,003
దేశంలో కొత్తగా 2,226 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 14,955 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నార‌ని పేర్కొంది. నిన్న 2,202 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,97,003కి పెరిగింది. క‌రోనా కార‌ణంగా నిన్న 65 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టివ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 5,24,413కి చేరింది. నిన్న దేశంలో 14,37,381 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు వాడిన క‌రోనా డోసుల సంఖ్య 192,28,66,524కి చేరింది.
India
Corona Virus
COVID19

More Telugu News