Kim Jong Un: గురువు శ‌వ‌పేటిక‌ను మోసిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్

Kim Jongun seen at North Korean state funeral not wearing mask
  • కిమ్‌కు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే గురువు
  • అనారోగ్య కారణాల‌తో గురువు మృతి 
  • అంత్యక్రియల్లో పాల్గొన్న‌ కిమ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్ గురుభ‌క్తిని చాటుకున్నారు. ఆయ‌న‌కు కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే గురువు. అనారోగ్య కారణాల‌తో ఆయ‌న మృతి చెందారు. దీంతో ఆయ‌న‌ అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొని కిమ్ నివాళులు అర్పించారు. ఇటీవ‌ల మాస్కు ధ‌రించి క‌న‌ప‌డిన కిమ్‌.. గురువు అంత్య‌క్రియ‌ల్లో మాత్రం మాస్కు లేకుండా క‌న‌ప‌డ్డారు. 

ఇత‌రులు అంద‌రూ మాస్కులు ధరించి ఇందులో పాల్గొన్నారు. గురువు శవపేటికను ఆయన కూడా మోశారు. కాగా, కిమ్ జాంగ్‌-2 మ‌ర‌ణం అనంత‌రం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ హ్యోన్‌ చొల్‌ హయే కీలక పాత్ర పోషించారు. అందుకే గురువుపై కిమ్ అంతగా భ‌క్తిని చాటుకున్నారు.
Kim Jong Un
North Korea
COVID19

More Telugu News