Nayanthara: కాబోయే భర్తతో కలిసి వళుత్తియూరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నయనతార!

Nayanathara and Vignesh Sivan offers prayers to their kuladaivam
  • పెళ్లిపీటలు ఎక్కనున్న నయన్, విఘ్నేశ్ శివన్
  • తిరుమలలో పెళ్లి చేసుకోనున్న ప్రేమ జంట
  • కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను పెట్టిన జంట
దక్షిణాది అగ్ర సినీతార నయనతార, తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తిరుమలలో పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించారు. ఇటీవలే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లి చేసుకోబోయే కల్యాణమంటపాన్ని పరిశీలించారు. 

తాజాగా వీరిద్దరూ తమ కులదైవం ఆలయానికి వెళ్లారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరు... అక్కడి నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్లి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను పెట్టినట్టు సమాచారం. జూన్ 9వ తేదీన వీరి వివాహం జరగనుంది. మరోవైపు పెళ్లి కారణంగా నయనతార ఏ సినిమాలోనూ నటించడం లేదు.
Nayanthara
Vignesh Sivan
Marriage
Weddingn Card

More Telugu News