Sekhar Movie: 'శేఖర్' సినిమా టైటిల్, అన్ని అగ్రిమెంట్లు నా పేరు మీదే ఉన్నాయి: బీరం సుధాకర్ రెడ్డి

Sekhar movie agreements are on my name says Beeram Sudhakar Reddy
  • సెన్సార్ సర్టిఫికెట్ కూడా నా పేరు మీదే ఉందన్న నిర్మాత సుధాకర్ రెడ్డి 
  • ఈ సినిమాకు తాను రూ. 15 కోట్లు ఇన్వెస్ట్ చేశానని వెల్లడి 
  • సినిమాను ఆపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్న నిర్మాత 
రాజశేఖర్, జీవిత దంపతులకు సమయం బాగున్నట్టు లేదు. పలు వివాదాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే 'గరుడవేగ' చిత్రానికి సంబంధించి ఒక చెక్ బౌన్స్ కేసును వారు ఎదుర్కొంటున్నారు. తాజాగా రిలీజైన 'శేఖర్' సినిమా కూడా వివాదాల్లో ఉంది. ఈ సినిమా విడుదలైన రెండో రోజే థియేటర్లలో ప్రదర్శనను నిలిపివేశారు. 

ఈ చిత్ర దర్శకురాలు జీవిత తన వద్ద డబ్బులు తీసుకుని, సినిమా విడుదలైనా తిరిగి ఇవ్వలేదని ఫైనాన్షియర్ పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో 48 గంటల్లో రూ. 64 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని.. లేనిపక్షంలో అన్ని ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమాను నిలిపి వేయాలని కోర్టు ఆర్డర్ వేసినట్టు పరంధామరెడ్డి తెలిపారు. 

మరోపక్క, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి చెబుతూ.. తన పేరు మీద సినిమా టైటిల్ సహా అన్ని అగ్రిమెంట్లు ఉన్నాయని తెలిపారు. సెన్సార్ సర్టిఫికెట్ సైతం తన పేరు మీదే ఉందని తెలిపారు. 'శేఖర్' సినిమాకు తాను రూ. 15 కోట్లు ఇన్వెస్ట్ చేశానని చెప్పారు. పరంధామరెడ్డి కారణంగా జరిగిన నష్టంపై తనకు క్లారిటీ కావాలని ఆయన అన్నారు. ఆ తర్వాతే శేఖర్ చిత్రాన్ని ఓటీటీకి అమ్ముతానని ఆయన చెప్పారు.
Sekhar Movie
Beeram Sudhakar Reddy
Jeevitha
Rajasekhar

More Telugu News