Amalapuram: కోనసీమ జిల్లా పేరు మార్పు... అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి!

Violence in Amalapuram

  • కోనసీమ పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన ప్రభుత్వం
  • పాత పేరే ఉంచాలని ఆందోళన చేస్తున్న ఓ వర్గం వారు
  • ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి

కోససీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. పేరు మార్చవద్దని, కోనసీమ జిల్లాగానే ఉంచాలని ఓ వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో వందలాది మంది అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్, ముమ్మిడివరం గేట్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. కోనసీమ జిల్లానే ముద్దు, వేరే పేరు వద్దు అంటూ నినాదాలు చేశారు.

 ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. 

ఈ దాడిలో పోలీసులకు, యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

  • Loading...

More Telugu News