Virat Kohli: కోహ్లీ తరచూ ఆటగాళ్లను మార్చేవాడు.. డూప్లెసిస్ సారథ్యం అలా కాదు: సెహ్వాగ్

Virat Kohli used to drop players after no performance in 2 games
  • రెండు మూడు మ్యాచుల్లో సరిగ్గా ఆడకపోతే కోహ్లీ తప్పించేవాడు
  • కోచ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లెసిస్ తో మార్పు వచ్చిందన్న సెహ్వాగ్
  • జట్టులో ఒకటి రెండు మినహా పెద్దగా మార్పుల్లేవని వెల్లడి
వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ప్లే ఆఫ్స్ లో చోటు సంపాదించుకుంది. లక్నో జట్టుతో నేడు పోటీ పడనుంది. ఫైనల్ కు వెళ్లాలంటే లక్నో జట్టుతోపాటు, రాజస్థాన్ జట్లను ఓడించాల్సి ఉంటుంది. కానీ, గతంతో పోలిస్తే ఆర్సీబీ జట్టు కాస్త నిలకడను, బలాన్ని ప్రదర్శిస్తుండడాన్ని గమనించొచ్చు. ఐపీఎల్ 2022 సీజన్ లో ఆర్సీబీ మంచి పనితీరు వెనుక కొత్త కోచ్ ఫాప్ డూప్లెసిస్, కోచ్ సంజయ్ బంగర్ ప్రధాన కారణంగా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. 

విరాట్ కోహ్లీ (గత సీజన్ వరకు ఆర్సీబీ కెప్టెన్ ) తరచూ ఆటగాళ్లను మారుస్తుండేవాడని సెహ్వగ్ గుర్తు చేశాడు. ఆటగాళ్లు రెండు మూడు మ్యాచుల్లో సరిగ్గా ఆడలేకపోతే వారిని తీసేసేవాడని తెలిపాడు. ఫాఫ్, బంగర్ ఆర్సీబీ జట్టులో ఎంతో నిలకడ తీసుకొచ్చినట్టు పేర్కొన్నాడు. ఇది మొత్తం మీద జట్టుకు మేలు చేసినట్టు అభిప్రాయపడ్డాడు. 

‘‘హెడ్ కోచ్ సంజయ్ బంగర్, కొత్త కెప్టెన్ డూప్లెసిస్ ఆర్సీబీ ఆలోచనలో మార్పు తెచ్చారు. ఒక ప్లేయర్ 2-3 మ్యాచుల్లో సరిగ్గా ఆడకపోతే అతడ్ని కోహ్లీ ఎలా తప్పించేవాడో మనం చూశాం. కానీ, బంగర్, డూప్లెసిస్ స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. పటిదార్, అనుజ్ రావత్ మినహా జట్టులోని ఇతర ఆటగాళ్లు రాణించలేకపోయినా మార్చలేదు’’ అని సెహ్వాగ్ వివరించాడు.
Virat Kohli
Sehwag
RCB
IPL

More Telugu News