Yasin Malik: కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు శిక్ష!

Kashmir separatist Yasin Malik sentenced life imprisonment

  • ఉగ్రవాదులకు నిధులు అందించారనే కేసులో శిక్ష విధించిన ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం
  • ఉరిశిక్షను విధించాలని కోర్టును కోరిన ఎన్ఐఏ
  • జీవిత ఖైదు విధించాలని కోరిన డిఫెన్స్ లాయర్లు

కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధించింది. ఉగ్రవాదులకు, సంఘ విద్రోహ శక్తులకు నిధులు అందించారనే కేసులో శిక్షను ఖరారు చేసింది. యాసిన్ మాలిక్ కు ఉరిశిక్ష విధించాలని కోర్టును ఎన్ఐఏ కోరింది. ఇదే సమయంలో శిక్షను విధించేటట్టయితే జీవిత ఖైదును విధించాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును విన్నవించారు. ఇరుపక్షాల వాదలను విన్న కోర్టు... ఈరోజు శిక్షను వెలువరించింది. యాసిన్ కు జీవిత ఖైదును విధించింది. 

మరోవైపు యాసిన్ మాలిక్ కు ఈరోజు శిక్షను ఖరారు చేస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి శ్రీనగర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్రోహశక్తులు అరాచకాలకు తెగబడే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ ను కట్ చేశారు.

  • Loading...

More Telugu News