Sensex: నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకుపోయిన మార్కెట్లు
- 503 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 144 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 5 శాతానికి పైగా లాభపడ్డ టాటా స్టీల్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు మంచి లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు లాభపడి 54,252కి పెరిగింది. నిఫ్టీ 144 పాయింట్లు పుంజుకుని 16,170కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.96%), యాక్సిస్ బ్యాంక్ (2.82%), నెస్లే ఇండియా (2.28%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.16%), రిలయన్స్ (-0.91%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.83%), ఎల్ అండ్ టీ (-0.36%), డాక్టర్ రెడ్డీస్ (-0.21%).