Facebook: మీ ఫేస్ బుక్ పోస్ట్ లు ఎవరు చూడాలో మీరే డిసైడ్ చేయవచ్చు!

Facebook will now let users manage who sees their posts
  • నూతన ప్రైవసీ పాలసీని తీసుకొచ్చిన మెటా
  • యూజర్ల అభిప్రాయాల ఆధారంగా కొత్త ఫీచర్లు
  • ఫేస్ బుక్ పోస్ట్ లపై యూజర్లకు మరింత నియంత్రణ
ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్రైవసీ పాలసీ (గోప్యతా విధానం) లో మెటా (వీటి మాతృ సంస్థ) మార్పులు తీసుకొచ్చింది. కొత్త విధానంలో భాగంగా యూజర్లు తమ పోస్ట్ లను ఎవరు చూశారో తెలుసుకోవచ్చు. అలాగే, భవిష్యత్తులో ఎవరు చూడాలనేది నిర్ణయించుకోవచ్చు. తాము చూసే ప్రకటనలను కూడా నియంత్రించుకోవచ్చు. నూతన పాలసీ కింద యూజర్ల డేటా సమీకరించడం లేదా షేర్ చేయడం ఉండదని స్పష్టం చేసింది.

‘‘మా ప్రైవసీ పాలసీని అప్ డేట్ చేసినట్టు యూజర్లకు నోటిఫికేషన్లు పంపిస్తున్నాం. మా టెక్నాలజీని వినియోగించే వారి నుంచి తీసుకున్న సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ప్రైవసీ పాలసీని మార్చాం. తాజా ఉత్పత్తులను అర్థం చేసుకునేందుకు వీలుగా రూపొందించాం’’ అని మెటా తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది.

ఫేస్ బుక్ లో పోస్ట్ లను ఎవరు చూడాలో సెట్ చేసుకునే కొత్త ఆప్షన్ ను మెటా ప్రవేశపెట్టింది. డిఫాల్ట్ ఆడియన్స్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. అందరికీ అని పెట్టుకుంటే పెట్టే పోస్ట్ లు అందరికీ కనిపిస్తాయి. మీ సన్నిహితులు, సహచర ఉద్యోగులు, స్నేహితులు ఇలా ఎవరు చూడాలన్నది కూడా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. యూజర్లు పెట్టుకున్న సెట్టింగ్స్ ఆధారంగా వారు ఎంపిక చేసుకున్న వారికే పోస్ట్ లు కనిపిస్తాయి. సెట్టింగ్స్ లో ప్రైవసీ ఆప్షన్ కు వెళ్లి సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు.

Facebook
New features
privacy policy
control
audience

More Telugu News