GVL Narasimha Rao: వైసీపీ చేతకానితనం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు: బీజేపీ ఎంపీ జీవీఎల్

If Tammineni wants to speak politics he has to resign to Speaker post says GVL Narasimha Rao
  • వైసీపీకి పాలన చేతకాదని తేలిపోయిందన్న జీవీఎల్   
  • దావోస్ పర్యటనపై వస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని డిమాండ్ 
  • స్పీకర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్య  
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. వైసీపీ చేతకానితనం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. వైసీపీకి పాలన చేతకాదని తెలిసి పోయిందని... ఇక గద్దె దిగడమే మేలని ఆయన అన్నారు. సీఎం జగన్, ఆయన బృందం చేపట్టిన దావోస్ పర్యటనపై వస్తున్న విమర్శలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

అమలాపురం అల్లర్లపై ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యం వల్ల అల్లర్లు చెలరేగాయా? లేక కావాలనే చేసిన పనా? అని ప్రశ్నించారు. వైసీపీ చేపట్టిన బస్సు యాత్రలో శాసనసభ స్పీకర్ రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని... రాజకీయాలు మాట్లాడాలనుకుంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని అన్నారు. 
GVL Narasimha Rao
BJP
YSRCP
Tammineni Sitaram
Amalapuram

More Telugu News