Karate Kalyani: అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై కరాటే కల్యాణి ఫిర్యాదు!

Karate Kalyani complains on youtube channels to CCS police
  • ఇటీవలే యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి
  • అశ్లీల వీడియోలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం
  • అశ్లీల వీడియోలతో లక్షలు సంపాదిస్తున్నారని ఆగ్రహం
సినీ నటి కరాటే కల్యాణి ఇటీవల హెడ్ లైన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని ఆమె చితక్కొట్టిన సంగతి తెలిసిందే. అతనిపై పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని.. దీని గురించి మాట్లాడేందుకు వెళ్లిన తనపై దాడి చేశాడని, తన చేతిలో పాప ఉన్నా పట్టించుకోలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 

తాజాగా ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై సీసీఎస్ లో కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది. మహిళలను కించపరుస్తూ, అసభ్యకరంగా వీడియోలను తీస్తున్నారని... ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని తన ఫిర్యాదులో ఆమె కోరింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ లోని 67 ఏ, 509 సెక్షన్ల కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే సంబంధిత యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు పంపనున్నారు. కేసు విచారణకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయనున్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో కరాటే కల్యాణి మాట్లాడుతూ, యూట్యూబ్ లో పెడుతున్న అశ్లీల వీడియోలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు తాను అన్ని ఆధారాలను అందజేశానని చెప్పారు. ఇంటికి పాల పాకెట్ వచ్చినంత ఈజీగా.. యూట్యూబ్ లోకి అశ్లీల వీడియోలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్లీల వీడియోలతో లక్షలు సంపాదిస్తున్నారని చెప్పారు. ఒకరిని చూసి మరొకరు ప్రాంక్ వీడియోలు చేస్తున్నారని తెలిపారు.
Karate Kalyani
Tollywood
Youtube Channels
Prank Videos

More Telugu News