YSRCP: టీటీడీ గోదాములో వైవీ సుబ్బారెడ్డి... జీడిపప్పు కాంట్రాక్టర్ టెండర్ రద్దు
- శ్రీవారి ప్రసాదంలో వాడే దినుసులను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి
- నాణ్యత లోపించిన జీడి పప్పును సరఫరా చేస్తున్నారని గుర్తించిన వైనం
- యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవని అనుమానం
- వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాలని అధికారులకు ఆదేశం
తిరుమల వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అందిస్తున్న ప్రసాదంలో వాడే దినుసులు నాణ్యతా లోపంతో ఉన్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గుర్తించారు. ఈ క్రమంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాణ్యత లేని దినుసులను పంపిణీ చేస్తున్న ఓ కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేశారు. అంతేకాకుండా నాణ్యత లేవన్న దినుసులను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి పరీక్షలు నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
టీటీడీ మార్కెటింగ్ గోదామును శనివారం ఆకస్మికంగా పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి.. శ్రీవారి ప్రసాదంలో వాడే జీడి పప్పు నాణ్యత లోపించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో జీడి పప్పును సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాలకులు, నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో వాటిని ప్రభుత్వ ల్యాబ్ కు పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించారు.