Kishan Reddy: పెద్ద మనసు చాటుకుంటున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy ready to adopt children who lost parents due to covid
  • అనేక జీవితాల్లో చీకట్లు నింపిన కరోనా
  • తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు
  • ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కిషన్ రెడ్డి
  • వారిని దత్తత తీసుకుంటానని ప్రకటన
కరోనా సంక్షోభం అనేక జీవితాల్లో చీకట్లు నింపింది. కరోనా మహమ్మారి అనేక కుటుంబాలను చిదిమేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన అనేకమంది చిన్నారులు అనాథలయ్యారు. ఇప్పుడీ అనాథ బాలలను దత్తత తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందుకు వచ్చారు. 

కొవిడ్ రక్కసి కారణంగా అయినవారిని కోల్పోయిన చిన్నారులకు తాను అండగా నిలుస్తానని కిషన్ రెడ్డి ప్రకటించారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి దిక్కులేని స్థితిలో దీనంగా నిలిచిన పిల్లలను రేపు (సోమవారం) హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద దత్తత తీసుకుంటున్నానని వివరించారు. సీతాఫల్ మండి వద్ద బీజేపీ నేతలతో 'మన్ కీ బాత్' కార్యక్రమం వీక్షించిన సందర్భంగా కిషన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.
Kishan Reddy
Adopt
Children
COVID19
Hyderabad
Telangana

More Telugu News