borders: ప్రధానిని కాదు.. 130 కోట్ల ప్రజలకు ప్రధాన సేవకుడిని: నరేంద్ర మోదీ

Our borders more secure than they were before 2014 says PM Modi at Shimla rally
  • ఫైల్స్ పై సంతకం పెట్టే క్షణంలోనే ప్రధానిని
  • మిగిలిన సమయంలో ప్రధాన సేవకుడినన్న మోదీ 
  • ప్రజలే తన జీవితం అని వ్యాఖ్యానించిన ప్రధాని 
  • దేశ సరిహద్దులు నేడు ఎంతో సురక్షితమని ప్రకటన
  • సిమ్లా రిడ్జ్ మైదాన్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగం
తాను దేశ ప్రధానిగా కంటే కూడా ప్రజా సేవకుడిగానే ఎప్పుడూ భావిస్తుంటానని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో ప్రధాని మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సరిహద్దులు 2014కు ముందు కంటే ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు. 

గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని స్వయంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో.. ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నది లక్ష్యం. ప్రధాని సైతం ఈ కార్యక్రమంలో భాగంగా తాను వెళ్లిన ప్రతి చోటా లద్ధిదారులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. 

‘‘గడిచిన ఎనిమిదేళ్లుగా నేను ఫైల్స్ పై సంతకం చేసే సమయంలో ప్రధానిగా బాధ్యత నిర్వహించానే తప్ప..  మిగిలిన సమయంలో 130 కోట్ల ప్రజలకు ప్రధాన సేవకుడిగానే పనిచేశాను. వారే నా జీవితం’’ అని ప్రధాని సిమ్లాలోని రిడ్స్ మైదాన్ లో జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు. ఈ ర్యాలీకి భారీగా ప్రజలు తరలిరావడం గమనార్హం. 

"2014కు ముందు కేవలం చర్చలే జరిగేవి. ఆచరణ ఉండేది కాదు. నెపోటిజం, స్కామ్ లు పెద్ద ఎత్తున ఉండేవి. కానీ, నేడు భారత్ అమలు చేస్తున్న పథకాలపై చర్చ నడుస్తోంది. భారత స్టార్టప్ లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత్ లో వ్యాపార సులభ నిర్వహణ గురించి ప్రపంచ బ్యాంకు కూడా మాట్లాడుతోంది'' అని ప్రధాని అన్నారు.

borders
secure
Prime Minister
Narendra Modi
simla
rally

More Telugu News