Indian Railways: తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్న రైల్వే!

Railways to Run 20 special Trains to Tirupati

  • 20 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
  • హైదరాబాద్–తిరుపతి, కాకినాడ–తిరుపతి మధ్య సర్వీసులు
  • కాచిగూడ నుంచి మరో రెండు స్పెషల్ ట్రైన్లు

శ్రీవారి భక్తులకు భారత రైల్వే శుభవార్తను చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్–తిరుపతి, తిరుపతి–హైదరాబాద్, తిరుపతి–కాకినాడ టౌన్, కాకినాడ టౌన్–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. 

తిరుపతి–హైదరాబాద్ మధ్య 10 సర్వీసులు నడవనున్నాయి. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లనున్నాయి. 

తిరుపతి–కాకినాడ టౌన్ మధ్య 10 రైళ్లు నడుస్తాయి. రేణిగుంట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఏలూరు, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లి గూడెంల మీదుగా నడుస్తాయి. 

వాటితో పాటు కాచిగూడ–తిరుపతి మధ్య రెండు వేసవి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. జూన్ 1, జూన్ 2న ఆ రైళ్లు నడుస్తాయి. ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంటల్లో ఆ రైళ్లు ఆగుతాయి.

  • Loading...

More Telugu News