WhatsApp: ట్విట్టర్ కంటే ముందే వాట్సాప్ పై ఎడిట్ బటన్!

WhatsApp may soon let you edit messages even after sending them

  • అభివృద్ధి చేస్తున్న సంస్థ
  • ఇందుకు సంబంధించిన సమాచారం లీక్
  • పంపిన సందేశాన్ని సెలక్ట్ చేసుకుని ఎడిట్ చేసుకునే వీలు

ట్విట్టర్ పై ఎడిట్ బటన్ కావాలా? అంటూ ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ట్విట్టర్ పై ఒక పోల్ నిర్వహించడం గుర్తుండే ఉంటుంది. దీనికి ఎక్కువ మంది కావాలనే బదులిచ్చారు. దీంతో త్వరలోనే ఎడిట్ బటన్ ను తీసుకొస్తామని ట్విట్టర్ ప్రకటించాల్సి వచ్చింది. మరి ఎడిట్ బటన్ ను ట్విట్టర్ ఎప్పుడు తీసుకొస్తుందో..? అసలు తెస్తుందో, లేదో? తెలియదు కానీ.. వాట్సాప్ మాత్రం ఈ ఫీచర్ ను ముందే పరిచయం చేసేట్టుగా ఉంది. వాట్సాప్ కు సంబంధించి అన్ని రకాల తాజా సమాచారం వెల్లడించే వాబీటాఇన్ఫో ఈ విషయాన్ని బయటపెట్టింది. 

వాట్సాప్ లో యూజర్లు మెస్సేజ్ చేసిన తర్వాత కూడా దాన్ని కావాల్సిన విధంగా మార్చుకునే వెసులుబాటు కల్పించేదే ఎడిట్ బటన్. ప్రస్తుతం ఈ ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్ ను వాబీటాఇన్ఫో పంచుకుంది. 

పంపించిన సందేశాల్లో కావాల్సిన దాన్ని సెలక్ట్ చేసుకున్నప్పుడు కాపీ, ఫార్వార్డ్ తో పాటు ఎడిట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఎడిట్ బటన్ ఎంపిక చేసుకున్న తర్వాత సందేశంలో తప్పులను సరిచేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్ పై ఒక సందేశం పంపిన తర్వాత నిర్ణీత సమయంలోపు దాన్ని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. కానీ, ఎడిటింగ్ కు అవకాశం లేదు. వాట్సాప్ ఈ ఫీచర్ ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News