TTD: శ్రీవారి భక్తులకు గమనిక.. లడ్డూ ప్రసాదం కొనుగోలుపై పరిమితి

TTD Giving Only Four laddus to its Devotees
  • భక్తులు పోటెత్తుతుండడంతో పరిమితి విధించిన అధికారులు
  • ఇప్పటి వరకు రెండు లడ్డూల కొనుగోలుకు మాత్రమే అనుమతి
  • రద్దీ తగ్గడంతో నాలుగింటికి పెంచిన టీటీడీ
వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తుతుండడంతో భక్తులకు ఇచ్చే లడ్డూలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిమితులు విధించింది. ఇప్పటి వరకు భక్తులు ఎన్ని లడ్డూలు అయినా కొనుక్కునే వీలుండగా, ఇప్పుడు రెండు మాత్రమే ఇస్తున్నట్టు భక్తులు చెబుతున్నారు. ఓ ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు లడ్డూలు మాత్రమే విక్రయించిన విషయం వాస్తవమేనని లడ్డూ ప్రసాద విక్రయం కేంద్రం అధికారులు తెలిపారు.

ప్రస్తుతం భక్తుల సంఖ్య రోజుకు 90వేలు దాటుతుండగా, లడ్డూలు మాత్రం 3 లక్షలు మాత్రమే తయారుచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పుడిప్పుడే భక్తుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో నాలుగు లడ్డూలు విక్రయిస్తున్నట్టు చెప్పారు.
TTD
Tirumala
Tirupati
Devotees
Laddu Prasadam

More Telugu News