Divyavani: మళ్లీ మనసు మార్చుకున్న సినీ నటి దివ్యవాణి.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన

Actress and TDP Leader Divyavani once again announced resignation

  • చంద్రబాబుతో భేటీ అనంతరం వీడియో విడుదల చేసిన దివ్యవాణి
  • నేడు విలేకరుల సమావేశంలో అన్ని విషయాలు చెబుతానన్న నటి
  • తనను ఇంత వరకు ఆదరించిన టీడీపీ పెద్దలకు ధన్యవాదాలన్న దివ్యవాణి

ప్రముఖ సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మరోమారు రాజీనామా ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో తనకు అవమానం జరిగిందని, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ట్వీట్ చేసి, ఆపై దానిని డిలీట్ చేసి చర్చకు తెరలేపిన దివ్యవాణి తాజాగా మరోమారు రాజీనామా ప్రకటన చేశారు. 

గత రాత్రి అధినేత చంద్రబాబుతో సమావేశమైన ఆమె తన రాజీనామా వార్తలపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ట్వీట్ కనిపించిందని, అందుకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ట్వీట్ చేశానని చెప్పారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే.. ఫేక్ పోస్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారని చెప్పుకొచ్చారు.  

అయితే, మళ్లీ ఏమైందో కానీ అంతలోనే ఆమె మనసు మార్చుకున్నారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. నేడు విలేకరుల సమావేశం నిర్వహించి చంద్రబాబుతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను వెల్లడిస్తానని చెప్పారు. తనను ఇంతవరకు ఆదరించిన టీడీపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు దివ్యవాణి తెలిపారు.

  • Loading...

More Telugu News