Hyderabad: హైదరాబాద్ లో జమ్మూకశ్మీర్ కు చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Jammu and Kashmir women sortware engineer commits suicide in Hyderabad
  • నానక్ రామ్ గూడలోని అపార్ట్ మెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య
  • గచ్చిబౌలిలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్న కృతి
  • ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిన వైనం
హైదరాబాద్ లో మరో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మూకశ్మీర్ కు చెందిన కృతి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని నానక్ రామ్ గూడలోని తానున్న అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె పని చేస్తున్నారు. 

ఆత్మహత్యకు ముందు ఆమె తన స్నేహితుడు సచిన్ కుమార్ కు మెసేజ్ పంపారు. వెంటనే సచిన్ ఆమె నివాసానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమెను ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. లవ్ అఫైరే ఆమె ఆత్మహత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Hyderabad
Software Engineer
Jammu And Kashmir
Sucide

More Telugu News