Bihar minister: మైనారిటీల్లో ఒక్కొక్కరికీ ముగ్గురు భార్యలు..20 మంది పిల్లలు..: బీహార్ మంత్రి బబ్లూ

Bangladeshis and Muslims with 3 wives  20 children Bihar minister

  • బీహార్ లో వేగంగా పెరిగిపోతున్న మైనారిటీ జనాభా
  • బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాలను కూడా లెక్కించాల్సిందే
  • కులాల వారీ గణనతోనే అది బయటపడుతుంది
  • బీహార్ కేబినెట్ మంత్రి బబ్లూ డిమాండ్

బీహార్ లో కులాల వారీ జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత దీనిపై భిన్నమైన వాదనలు చోటు చేసుకుంటున్నాయి. కులాల వారీ జనాభా లెక్కింపుల్లో భాగంగా.. బీహార్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను కూడా లెక్కించాలని కేబినెట్ మంత్రి నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ డిమాండ్ చేశారు. అదే సమయంలో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలను లెక్కించకూడదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేయడం గమనార్హం. 

‘‘ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరికి ముగ్గురు భార్యలు, 15-20 మంది వరకు పిల్లలు ఉన్నారు. వారు జనాభా లెక్కల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. జనాభా లెక్కల్లోకి రాకూడదన్నది వారి ఆలోచన. వారిని కూడా లెక్కల్లోకి తీసుకోవాల్సిందే. అప్పుడే బీహార్ లో మైనారిటీ జనాభా ఎంత వేగంగా పెరుగుతుందో తెలుస్తుంది’’ అని నీరజ్ కుమార్ బబ్లూ డిమాండ్ చేశారు. 

గడిచిన కొన్ని సంవత్సరాల్లో బీహార్ లో ముస్లింల జనాభా చాలా వేగంగా పెరిగినట్టు బబ్లూ చెప్పారు. వారి జనాభా ఎంత వేగంగా పెరిగిందో కులాల వారీ జనగణనతో తేలిపోతుందన్నారు.

  • Loading...

More Telugu News