TDP: ప‌ల్నాడులో టీడీపీ కార్య‌క‌ర్త హత్యపై నారా లోకేశ్ ఆగ్ర‌హం

nara lokesh fires onysrcp attack on tdp in palnadu district
  • ప‌ల్నాడు జిల్లా దుర్గి మండ‌లంలో దాడి
  • చ‌నిపోయిన టీడీపీ కార్య‌క‌ర్ల జ‌ల్ల‌య్య‌
  • ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నారా లోకేశ్ ట్వీట్
  • జ‌ల్ల‌య్య కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న‌
నేడు ప‌ల్నాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడులో టీడీపీ శ్రేణుల‌పై జరిగిన దాడి ఘ‌ట‌న‌పై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ఇంకెంత మందిని పొట్ట‌న‌బెట్టుకుంటార‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీని ప్ర‌శ్నించారు. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంతో పాటు నేర క్రూర మ‌న‌స్త‌త్వం ఉన్న జ‌గ‌న్‌రెడ్డికి ఒక్క చాన్స్ పేరుతో ముఖ్య‌మంత్రి గ‌ద్దెనెక్కిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అరాచ‌క‌ప్ర‌దేశ్‌గా మార్చేశార‌ని లోకేశ్ మండిపడ్డారు. 

మొన్న సుబ్బ‌య్య‌, నిన్న చంద్ర‌య్య,  నేడు జ‌ల్ల‌య్య‌ని అంతం చేసిన మీరు ఇంకెంత‌కాలం సాగిస్తారు ఈ న‌ర‌మేధం? అంటూ సీఎం జ‌గ‌న్‌ను ఆయ‌న నిలదీశారు. వైసీపీ మూక‌ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జ‌ల్ల‌య్య కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంటుందని, గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తామ‌ని లోకేశ్ ప్ర‌క‌టించారు.
TDP
YSRCP
Palnadu District
Nara Lokesh

More Telugu News