Andhra Pradesh: ఈరోజే ఏపీ పదోతరగతి పరీక్షల ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవాలి!

AP 10th class results releasing today

  • ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఫలితాలు
  • bse.ap.gov.in వెబ్ సైట్ లోకి లాగినై ఫలితాలను చూసుకోవచ్చు 
  • పరీక్షలకు హాజరైన 6,21,799 మంది విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. మరికొన్ని గంటల్లో ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్  bse.ap.gov.in లోకి లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు. 

కరోనా వల్ల గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులంతా ఇంటర్మీడియట్ కు ప్రమోషన్ పొందారు. మహమ్మారి తీవ్రత పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ఏడాది పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,00,063 మంది బాలురు కాగా... 3,02,474 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News