Andhra Pradesh: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా
- ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ఫలితాలు
- అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా
- సోమవారం ఫలితాలను విడుదల చేస్తామన్న అధికారులు
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. ఫలితాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూశారు. ఎంతసేపటికీ వెబ్ సైట్ల లో ఫలితాలు విడుదల కాకపోవడంతో వారంతా ఉత్కంఠగా గడిపారు.
పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో ఫలితాలు విడుదలవుతాయని చెప్పారు. ఫలితాల విడుదల వాయిదా పడటానికి కారణం ఏమిటనేది వెల్లడి కానప్పటికీ... సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్టు తెలుస్తోంది.
మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ సారి గ్రేడింగ్ రూపంలో కాకుండా, మార్కుల రూపంలో ఫలితాలను వెల్లడించనున్నారు.