Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేశ్ కు యాంజియోప్లాస్టి... ఫోన్ లో పరామర్శించిన సీఎం జగన్

CM Jagan talked to Adimulapu Suresh
  • సామాజిక న్యాయభేరిలో పాల్గొన్న ఆదిమూలపు
  • అనంతరం అస్వస్థత
  • యాంజియోప్లాస్టి తప్పనిసరి అన్న వైద్యులు
  • ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలన్న సీఎం జగన్
ఏపీ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు వైద్యులు యాంజియోప్లాస్టి నిర్వహించారు. మంత్రి సురేశ్ ఇటీవల వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం యాంజియోప్లాస్టి తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, వైద్యులు అత్యవసర ప్రాతిపదికన మంత్రి ఆదిమూలపు సురేశ్ కు యాంజియోప్లాస్టి నిర్వహించారు. 

కాగా, మంత్రివర్గ సహచరుడు సురేశ్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. అనంతరం ఆయనకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Adimulapu Suresh
CM Jagan
Angioplasty
Minister
YSRCP

More Telugu News