TTD: తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్

TTD to Issue daily 1000 tickets to Devotees who came from TSRTC
  • రోజుకు 1000 మందికి రూ. 300 దర్శన టికెట్లు
  • ప్రయాణానికి రెండు రోజుల ముందు రిజర్వు చేసుకుంటేనే దర్శన టికెట్లు
  • టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకారం
తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి రోజుకు 1000 మందికి రూ. 300 దర్శన టికెట్లు జారీ చేయనున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆ సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. రోజుకు వెయ్యి మందికి టికెట్లు జారీ చేసేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అంగీకరించినట్టు చెప్పారు. 

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు కావాలనుకున్న వారు ప్రయాణానికి రెండు రోజుల ముందు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ చేసిన ఈ ప్రకటనపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
TTD
Tirumala
Tirupati
TSRTC
VC Sajjanar
Bajireddy Goverdhan

More Telugu News