North Korea: తగ్గనంటున్న ఉత్తర కొరియా.. వరుసగా బాలిస్టిక్ క్షిపణల ప్రయోగాలు

North Korea launches multiple ballistic missiles
  • మూడు ప్రాంతాల నుంచి సముద్రంపైకి ప్రయోగాలు
  • దక్షిణ కొరియాకు పరోక్షహెచ్చరిక
  • ఖండించిన దక్షిణ కొరియా సైన్యం
  • తమకు ఆమోదనీయం కాదంటూ ప్రకటన
ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగిరం చేసింది. తాజాగా ఆదివారం తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణులను నీటిలోకి ప్రయోగించి చూసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. దక్షిణ కొరియా, అమెరికా మధ్య మొట్ట మొదటి ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు ముగిసిన మర్నాడే ఉత్తర కొరియా అణు క్షిపణులను ప్రయోగించడం ద్వారా దక్షిణ కొరియాను పరోక్షంగా హెచ్చరించినట్టు అయింది. 

‘‘తూర్పు తీరంలో సముద్రం పైకి స్వల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే ఎనిమిది బాలిస్టిక్ క్షిపణులను ప్యాంగ్ యాంగ్ లోని సునాన్ నుంచి ప్రయోగించినట్టు మా సైన్యం గుర్తించింది’’అని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. ఆదివారం ఉదయం 30 నిమిషాల వ్యవధిలో ఈ ప్రయోగాలు జరిగినట్టు చెప్పారు. మూడు చోట్ల నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని చెబుతూ, ఇది ఆమోదనీయం కాదన్నారు. ఊహించనంత అధికంగా ఈ ఏడాది ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తున్నట్టు చెప్పారు.
North Korea
testing
launches
ballistic missiles

More Telugu News