Jubilee Hills Rape Case: జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన.. వీడియోలు వైరల్ చేసిన వ్యక్తికి అరదండాలు

Jubilee Hills Rape Case Police Arrested subhan who is posted videos on social media
  • పాతబస్తీకి చెందిన సుభాన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు
  • నిందితుల కస్టడీ కోసం పిటిషన్ వేయనున్న పోలీసులు
సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుల ఫొటోలు, వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు‌కు అవి ఎలా చేరాయో ఆరా తీస్తున్న పోలీసులు తాజాగా, ఈ వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ను అరెస్ట్ చేశారు. అలాగే, రఘునందన్‌రావుపైనా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

కాగా, రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ కేసులో కీలక నిందితుడైన ఉమేర్‌ఖాన్ (18)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నా ధ్రువీకరించాల్సి ఉంది. మరికొందరు మాత్రం అతడు ఇంకా పరారీలోనే ఉన్నాడని చెబుతున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుల కస్టడీ కోసం పిటిషన్ వేయాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Jubilee Hills Rape Case
Jubilee Hills
Gang Rape
Hyderabad

More Telugu News