UAE: వచ్చే జనవరి-ఫిబ్రవరి మధ్య యూఏఈ తొలి క్రికెట్ లీగ్
- ఐపీఎల్ మాదిరే టోర్నమెంట్
- మొత్తం ఆరు ఫ్రాంచైజీలు
- ఐదు భారత కంపెనీల సొంతం
- మొత్తం 34 మ్యాచుల నిర్వహణ
ఐపీఎల్ మాదిరే పురుడు పోసుకున్నదే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ‘ఇంటర్నేషనల్ లీగ్ టీ 20’ (ఐఎల్ టీ20). ఐపీఎల్ ఎంత సక్సెస్ ఫుల్ లీగో ప్రతి ఒక్కరికి తెలుసు. ఐపీఎల్ సమయంలో రూ.వేలాది కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు సైతం సొంత లీగ్ కు రూపకల్పన చేసింది. ఈ టర్నోమెంట్ తొలిసారిగా వచ్చే జనవరి 6న మొదలు కానుంది. ఫిబ్రవరి 12న ముగుస్తుంది.
మొత్తం ఆరు జట్లు ఉంటాయి. అందులో ఐదు జట్లను భారత కంపెనీలే కొనుగోలు చేశాయి. ఆరు జట్లు కలసి 34 మ్యాచ్ లు ఆడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలకు వినోదాన్ని పంచడంలో తాము కొత్త శిఖరాలను అధిరోహిస్తామని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహ్యాన్ తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ కతా నైట్ రైడర్స్ గ్రూపు, క్యాప్రి గ్లోబల్, జీఎంఆర్, ల్యాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్ లైన్ తలా ఒక ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాయి. ఇందులో ల్యాన్సర్ క్యాపిటల్ మినహా మిగిలినవన్నీ భారత కంపెనీలే.