Prashant Kishor: బీహార్ యాత్రలో పీకే బిజీ.. వైసీపీ వ్యూహకర్తగా రుషిరాజ్?

Rishi Raj Singh is the ysrcp political strategist
  • బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ప్రశాంత్ కిషోర్
  • పీకే సహచరుడైన రుషిరాజ్‌కు వైసీపీ వ్యూహకర్త బాధ్యతలు
  • నేటి వర్క్‌షాప్‌లో రుషిని పరిచయం చేయనున్న పీకే!
గత ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సహచరుడైన రుషిరాజ్ సింగ్‌కు వైసీపీ వ్యూహకర్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్.. ఆ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పీకేకు చెందిన ఐప్యాక్‌తోనే వైసీపీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పీకే వైసీపీ వ్యూహకర్తగా పనిచేయాల్సి ఉంది. 

అయితే, ప్రస్తుతం ఆయన బీహార్‌లో ‘జన్ సురాజ్’ యాత్రలో బిజీగా ఉండడంతో ఆ బాధ్యతను ఐప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడైన రుషి రాజ్ సింగ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న వర్క్ షాప్‌లో రుషి రాజ్‌ను వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పరిచయం చేస్తారని సమాచారం.
Prashant Kishor
YSRCP
Rishi Raj Singh
Andhra Pradesh

More Telugu News