KL Rahul: గాయాలతో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ ఔట్... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు కెప్టెన్ గా రిషబ్ పంత్

KL Rahul and Kuldeep Yadav ruled out of T20 series with injuries
  • రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్
  • ప్రారంభానికి ముందే భారత్ కు ఎదురుదెబ్బ
  • గజ్జల్లో గాయంతో బాధపడుతున్న రాహుల్
  • నెట్ ప్రాక్టీసులో కుల్దీప్ చేతికి గాయం
  • ఇద్దరూ సిరీస్ మొత్తానికి దూరం
రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ జరగనుండగా, టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్ ప్రారంభం కాకముందే కెప్టెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయపడ్డారు. వీరిద్దరూ సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బీసీసీఐ వెల్లడించింది. రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని తెలిపింది. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను నియమించినట్టు ఓ ప్రకటన చేసింది. కేఎల్ రాహుల్ కు కుడివైపు గజ్జల్లో గాయమైందని, కుల్దీప్ యాదవ్ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తుండగా చేతికి బంతి తగిలిందని బీసీసీఐ వివరించింది.
KL Rahul
Kuldeep Yadav
Injuires
T20 Series
Team India
South Africa
BCCI

More Telugu News