Jawahar: కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదు.. పదో తరగతి పరీక్షల్లో: జవహర్

Jawahar fires on Kodali Nani after he enters Nara Lokesh Zoom meeting
  • పదో తరగతి విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన నారా లోకేశ్
  • జూమ్ మీటింగ్ లోకి వచ్చిన కొడాలి నాని, నారా లోకేశ్
  • వేలిముద్రగాళ్లు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్న జవహర్
పదో తరగతి విద్యార్థులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లోకి ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంటర్ కావడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఐడీల పేర్లతో వీరు జూమ్ మీటింగ్ లోకి ప్రవేశించారు. 

ఈ ఘటనపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ... కొడాలి నాని కూర్చోవాల్సింది జూమ్ మీటింగ్ లో కాదని, పదో తరగతి పరీక్షల్లో అని అన్నారు. వేలిముద్రగాళ్లు రాజకీయాల్లో ఉంటే ఇలాగే జరుగుతుందని ఎద్దేవా చేశారు. సీఎంతో పాటు ఆయన సహచరులందరికీ చదువంటే చాలా చులకన భావం ఉందని చెప్పారు. తమ నేత లోకేశ్ విద్యార్థుల కోసం యజ్ఞం చేస్తుంటే... వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని అన్నారు. ఏపీలో చదువులు ఎటు పోతున్నాయో అర్థంకాని పరిస్థితి ఉందని చెప్పారు.
Jawahar
Telugudesam
Kodali Nani
Vallabhaneni Vamsi

More Telugu News