Sathyadev: 'గాడ్సే' స్టార్ హీరో చేయవలసిన సినిమా: సత్యదేవ్

Godse Movie Update
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'గాడ్సే'
  •  ప్రధానమైన పాత్రను పోషించిన సత్యదేవ్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్  
  • ఈ నెల 17న థియేటర్స్ కి రానున్న సినిమా
సత్యదేవ్ హీరోగా సి.కల్యాణ్ నిర్మించిన 'గాడ్సే' సినిమాకి గోపీగణేశ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సత్యదేవ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా ఈ రోజున ఇంతవరకూ రావడానికి కారకులు కేఎస్ రామారావుగారు .. సి.కల్యాణ్ గారు. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

దర్శకుడు గోపీగణేశ్ కి చాలా నిబ్బరం .. నిలకడ ఎక్కువ. ఆయన ఈ కథను నాకు వినిపించినప్పుడు, ఇది పెద్ద హీరోలు  చేయవలసిన సినిమా అనిపించింది. కానీ ఆయన నన్ను నాకంటే ఎక్కువగా నమ్మాడు. 'ఇది మీరు చేయగలరు .. మీరే చేయాలి' అని అన్నాడు. సమాజంలోని చిన్న చిన్న విషయాల పట్ల కూడా ఆయనకి గల అవగాహన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 

 ఇది యూత్ కోసం చేసిన సినిమా. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా 'అవును కదా ఎందుకు ఇలా జరుగుతుంది?' అనుకుంటూ చర్చించుకుంటారు. రెండోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది. కచ్చితంగా ఆ ఎపిసోడ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.
Sathyadev
Aishwarya lakshmi
Godse Movie

More Telugu News