USA: అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుడి కాల్పులు.. ముగ్గురి మృతి

3 people died in a shooting at a Maryland manufacturing facility
  • కొలంబియా మెషీన్ అనే కంపెనీలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు
  • పోలీసుల అదుపులో నిందితుడు
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. మేరీల్యాండ్‌లోని స్మిత్స్‌బర్గ్‌లో కొలంబియా మెషీన్ అనే మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు వాషింగ్టన్ సిటీ పోలీసులు తెలిపారు. బాధితులు కంపెనీ ఉద్యోగులా? కాదా? అన్న విషయంలో స్పష్టత లేదని  పేర్కొన్నారు. 

కాల్పుల తర్వాత అక్కడి నుంచి పరారైన నిందితుడిని ఘటనా స్థలానికి కొద్ది దూరంలో మేరీల్యాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.
USA
Maryland
Colombia Mechine
Smithsburg

More Telugu News