Vignesh Shivan: తిరుమలలో జరిగిన దానిపై క్షమాపణలతో విఘ్నేశ్ శివన్ లేఖ

vignesh shivan apologies about weared sandals
  • కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మరిచామని వివరణ
  • దేవుడిపై ఎంతో నమ్మకం, విశ్వాసం ఉన్నట్టు ప్రకటన
  • దయచేసి క్షమించాలని వేడుకుంటూ టీటీడీకి లేఖ
కాళ్లకు చెప్పులు ధరించి తిరుమల మాడ వీధుల్లో నడవడం పట్ల తమిళ నటుడు విఘ్నేశ్ శివన్ క్షమాపణలు చెప్పారు. టీటీడీకి ఆయన తాజాగా ఒక లేఖ రాస్తూ.. తమ కాళ్లకు చెప్పులు ఉన్నాయన్న విషయాన్ని గమనించలేదన్నారు. శ్రీవారిపై ఎంతో నమ్మకం, భక్తి ఉన్నాయని చెబుతూ.. తెలియక చేసిన తప్పును మన్నించాలని వేడుకున్నారు. 

‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలన్నది మా కోరిక. అందుకే గత నెల రోజుల్లో తిరుమలకు ఐదు సార్లు వచ్చి వెళ్లాం. కానీ, అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పెళ్లి అయిన వెంటనే నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణ సేవలో పాల్గొనాలన్నది మా ఆలోచన. అదే ఆలోచనతో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం తర్వాత ఆలయం ముందు ఫొటోలు తీసుకున్నది.. మా పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోవాలనే. ఈ హడావిడిలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు ఎంతో నమ్మకం ఉంది. దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అంటూ విఘ్నేశ్ శివన్ లేఖలో కోరారు.  

Vignesh Shivan
nayanathara
tirumala
cheppals
apologies

More Telugu News