Mumbai: ముంబయిని పలకరించిన నైరుతి రుతుపవనాలు... అధికారికంగా ప్రకటించిన ఐఎండీ

IMD announces the on set of Southwest Monsoon over Mumbai

  • మే 29న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
  • నిదానంగా ముందుకు కదులుతున్న వైనం
  • గత రాత్రి ముంబయిలో ఉరుములు, మెరుపులు
  • గత 24 గంటల్లో 61.8 మిమీ వర్షపాతం

ఈ ఏడాది కాస్త ముందే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు నిదానంగా ముందుకు కదులుతున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ముంబయిని పలకరించాయి. గత రాత్రి ముంబయిలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నైరుతికి స్వాగతం పలికింది. ముంబయిపై నైరుతి ప్రభావం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నేడు అధికారికంగా ప్రకటించింది. 

కాగా, గత 24 గంటల వ్యవధిలో ముంబయిలో 61.8 మిమీ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

ప్రతి ఏడాది ముంబయిలో నైరుతి రుతుపవనాలు కుంభవృష్టికి కారణమవుతుంటాయి. ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ అంచనాల నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.

  • Loading...

More Telugu News