Drunk Driving: 15 బీర్లు తాగేసి.. ఎంచక్కా బైక్ ఎక్కేసి: పోలీసులకు చిక్కిన మందుబాబు!

Man drinked 15 beers Breath analyser shows 530 points in Penamaluru
  • పూటుగా మద్యం తాగి బందరు రోడ్డుపై హడావిడి
  • బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించి విస్తుపోయిన సీఐ
  • 530 పాయింట్లు చూపించడంతో షాక్
  • తమకు దొరికి ప్రాణాలతో బయటపడ్డాడన్న సీఐ
15కు పైగా బీర్లను పొట్టలో పోసేసిన ఓ వ్యక్తి ఆపై ఎంచక్కా బైక్ ఎక్కేసి రోడ్డుపైకి వచ్చి పోలీసులకు చిక్కాడు. పెనమలూరు సీఐ గోవిందరాజు కథనం ప్రకారం.. గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకల వరకు మద్యం తాగి బైక్‌పై షికారుకు బయలుదేరాడు. ఆపై బందరు రోడ్డుపై కాసేపు హడావిడి చేసి పోలీసులకు చిక్కాడు.

పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన సీఐ.. రీడింగ్ పర్సంటేజీ చూసి విస్తుపోయరు. అందులో ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో షాకయ్యారు. 15కు పైగా బీర్లు తాగితే తప్ప అంత రీడింగ్ రాదని సీఐ పేర్కొన్నారు. అతడి వాహనాన్ని సీజ్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు చెప్పారు. 

అతడు తమకు చిక్కడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడని, వేరే మార్గంలో వెళ్లి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదన్నారు. కాగా, అతడిలానే మద్యం తాగి వాహనాలు నడిపిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు.
Drunk Driving
Penamaluru
Bandar
Gudivada

More Telugu News