Kangana Ranaut: ఒక మహిళ చేసిన వ్యాఖ్యలకు మొత్తం దేశాన్ని ఇబ్బంది పెడుతున్నారు: కంగనా రనౌత్

Kangana Ranaut response on Nupur Sharma comments
  • మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
  • నుపుర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ
  • తాను హిందువుగా ఉండటానికి ఇష్టపడతానన్న కంగన
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. గల్ఫ్ దేశాల నుంచి కూడా ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆమెపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. 

రంగస్థలంపై శివుడి పాత్రను పోషించే వ్యక్తిని తన కోరిక తీర్చాలంటూ మరో వ్యక్తి ఇబ్బంది పెడతాడు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన కంగన... తాను హిందువుగా ఉండటానికి ఇష్టపడటానికి ఇది కూడా ఒక కారణమని చెప్పింది. ఇలాంటివి కూడా తన ఆథ్యాత్మికతకు లేదా విశ్వాసానికి భంగం కలిగించవని తెలిపింది. అయితే కేవలం ఒక మహిళ చేసిన కామెంట్ల వల్ల దేశం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేస్తారని ప్రశ్నించారు. ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.
Kangana Ranaut
Bollywood
Nupur Sharma
BJP
Prophet

More Telugu News