Pawan Kalyan: పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన మహేశ్ బాబు, అడివి శేష్

Mahesh Babu and Adivi Sesh replies to Pawan Kalyan statement on Major movie
  • ఇటీవల విడుదలైన మేజర్
  • విడుదలైన ప్రతి చోట హిట్ టాక్
  • చిత్రబృందాన్ని అభినందిస్తూ పవన్ కల్యాణ్ ప్రకటన
  • కృతజ్ఞతలు తెలిపిన మహేశ్ బాబు
  • ధన్యుడ్ని అంటూ అడివి శేష్ ట్వీట్
ఇటీవల విడుదలైన మేజర్ చిత్రం గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. దీనిపై ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, హీరో అడివి శేష్ స్పందించారు. "థాంక్యూ పవన్ కల్యాణ్" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. "మీ స్పందనతో మేజర్ టీమ్ నిజంగా ఆనందంతో పొంగిపోతోంది" అని పేర్కొన్నారు. 

అడివి శేష్ కూడా ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. "డియర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్... నా హృదయం ఆనందంతో నిండిపోయింది. టూర్ బిజీగా ఉండేసరికి మీకు మేజర్ సినిమా చూసే టైమ్ ఉంటుందా అని అనుకున్నా. కానీ మీరు వ్యక్తిగతంగా ఎంతో హృదయపూర్వకంగా రాసిన లేఖ నిజంగా మనసును తాకింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ను నా సర్వస్వంగా భావిస్తాను. ఆ రోజు పంజా, ఇవాళ మేజర్. మీ అభిమానానికి ధన్యుడ్ని" అంటూ అడివి శేష్ పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ హీరోగా 2011లో వచ్చిన 'పంజా' చిత్రంలో అడివి శేష్ ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan
Mahesh Babu
Adivi Sesh
Major
Movie
Biopic

More Telugu News