Queen Elizabeth II: ఒక రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రెండో వ్యక్తిగా క్వీన్ ఎలిజబెత్ 2... తొలి స్థానంలో ఎవరున్నారంటే..!

Queen Elizabeth II is the second highest time ruler in the world

  • 70 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న క్వీన్ ఎలిజబెత్
  • 72 ఏళ్ల 114 రోజులు పాలించిన లూయి చక్రవర్తి
  • మరో రెండేళ్లు పాలిస్తే ఎవరూ సాధించలేని రికార్డు బ్రిటీష్ రాణి సొంతం

బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 మరో ఘనతను సాధించారు. ఒక రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రెండో వ్యక్తిగా ఆమె రికార్డులకెక్కారు. ఈ క్రమంలో ఆమె థాయ్ లాండ్ రాజును అధిగమించారు. థాయ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్ 1927 నుంచి 2016 మధ్య కాలంలో 70 ఏళ్ల 126 రోజులు పాలించారు. ఆయన రికార్డును ఇప్పుడు క్వీన్ ఎలిజబెత్ అధిగమించారు. 

మరో రెండేళ్ల పాటు తన పాలనను కొనసాగిస్తే... ఈ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం దేశాన్ని పాలించిన వ్యక్తిగా మరెవరికీ సాధ్యం కాని రికార్డు ఆమె సొంతమవుతుంది. ప్రపంచంలో అత్యధిక కాలం పాలించిన వ్యక్తిగా ఫ్రాన్స్ చక్రవర్తి లూయి ఉన్నారు. ఆయన 1643 నుంచి 1715 వరకు మొత్తం 72 ఏళ్ల 114 రోజుల పాలన కొనసాగించారు. మరోవైపు బ్రిటిష్ రాణిగా 70 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో... ఇటీవల ఆమె ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మరో రెండేళ్లు కొనసాగితే లూయి రికార్డును ఆమె అధిగమిస్తారు.

  • Loading...

More Telugu News