Kangana Ranaut: నుపుర్ శర్మకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

Kangana came into support for Nupur Sharma again
  • మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం
  • నుపుర్ శర్మపై ఆగ్రహావేశాలు
  • నుపుర్ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయకూడదన్న కంగన 
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి తీవ్ర ఆగ్రహానికి గురవుతున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మరోసారి మద్దతు పలికింది. ఈ క్రమంలో కంగన తీవ్రస్థాయిలో స్పందించింది. 

"నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వారు మద్యం తాగుతారు, ధూమపానం చేస్తారు. వారిలో పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నవారు ఉన్నారు. వారు బురఖాలు ధరించరు. బూతులు మాట్లాడతారు, పందిమాంసం తింటారు. వాళ్లు అలాంటి వాతావరణంలో పనిచేస్తుంటారు. వాళ్లు అన్ని నియమాలు పాటించరు కూడా. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛాయుత వాతావరణ సౌందర్యం ఇదే. నుపుర్ ఒక్కదాన్నే నేరస్థురాలిగా చేయడం కాదు... ప్రతి ఒక్కరూ క్రిమినల్ గా మారుతున్నారు" అంటూ కంగన ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది.
Kangana Ranaut
Nupur Sharma
Prophet
India

More Telugu News