Enugu: జులై 1న వస్తున్న 'ఏనుగు'... కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం

Arun Vijay starred Enugu new release date confirmed
  • షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న రావాల్సిన 'ఏనుగు'
  • సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా
  • అరుణ్ విజయ్ హీరోగా 'ఏనుగు'
  • సింగం ఫేమ్ హరి దర్శకత్వం
తమిళ నటుడు అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'ఏనుగు'. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్రబృందం ప్రకటించింది. జులై 1న 'ఏనుగు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించింది. వాస్తవానికి ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో విడుదల వాయిదాపడినట్టు చిత్రబృందం ప్రకటించింది. అనంతరం, కొత్త రిలీజ్ డేట్ ను వెల్లడించారు. 

ఈ సినిమాకు 'సింగం' ఫేమ్ హరి దర్శకత్వం వహించాడు. ఇందులో అరుణ్ విజయ్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయిక కాగా, రాధిక, సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, యోగిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు
Enugu
Release Date
Arun Vijay
Hari

More Telugu News