Nikhat Zareen: ఓ వర్గానికి కాదు... దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా: బాక్సర్ నిఖత్ జరీన్

Boxer Nikhat Zareen said she represents country not for community
  • ఇటీవలే వరల్డ్ టైటిల్ గెలిచిన నిఖత్ జరీన్
  • ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలకు సన్నద్ధం
  • హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయం కాదన్న నిఖత్
  • దేశమే ముఖ్యమని వెల్లడి
ఫ్లయ్ వెయిట్ విభాగంలో ప్రపంచ విజేతగా నిలిచిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (25) తాను కేవలం ఓ వర్గానికి ప్రాతినిధ్యం వహించడంలేదని, తాను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని స్పష్టం చేసింది. తాను బాక్సింగ్ లో సాధించిన ఘనతల కంటే, తన మత నేపథ్యం గురించే ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్నారన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా జవాబిచ్చింది. 

ఓ అథ్లెట్ గా తాను భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తానని, తన వరకు హిందూ, ముస్లిం అనేది పెద్ద విషయమే కాదని అభిప్రాయపడింది. "నా దేశానికి ఓ పతకం సాధించడం పట్ల ఎంతో సంతోషిస్తాను" అని నిఖత్ వెల్లడించింది. 

నిఖత్ వచ్చే నెలలో బ్రిటన్ లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కు సన్నద్ధమవుతోంది. ఢిల్లీలో నిర్వహించిన ట్రయల్స్ లో నిఖత్ విజయం సాధించి కామన్వెల్త్ క్రీడలకు అర్హత పొందింది.
Nikhat Zareen
Community
Country
Boxing
India

More Telugu News