Amber Heard: అతని అద్భుత నటన వల్లే తీర్పు అతడి వైపు: హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్

I dont blame them He is a fantastic actor Amber Heard on jurys verdict favouring Johnny Depp
  • వాస్తవ అంశాల ఆధారంగా లేదన్న హాలీవుడ్ నటి
  • నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలు ఇతరులకు తెలియవని వ్యాఖ్య
  • ఎవరేమి అనుకున్నా తాను పట్టించుకోనని స్పష్టీకరణ
పరువు నష్టం కేసులో ప్రతికూల తీర్పును చవిచూసిన తర్వాత మొదటిసారిగా హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ నోరు విప్పింది. తన మాజీ భర్త జానీ డెప్ అద్భుత నటనా నైపుణ్యాల ఆధారంగానే జ్యురీ తీర్పు ఇచ్చిందే కానీ, వాస్తవ అంశాల ఆధారంగా కాదంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను వారిని (జ్యురీ) ఏమీ కించపరచడం లేదు. నేను అర్థం చేసుకోగలను. అతడిది (జానీ డెప్) ప్రేమపూర్వక పాత్ర. ప్రజలకు తెలిసినవాడిగా అతడ్ని భావిస్తారు. అతను అద్భుతమైన నటుడు’’ అని హెర్డ్ పేర్కొంది.

పరువు నష్టం కేసు విషయంలో సోషల్ మీడియా కవరేజీ న్యాయబద్ధంగా లేదని హెర్డ్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. టిక్ టాక్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇతర ప్లాట్ ఫామ్ లలో చాలా వరకు పోస్ట్ లు జానీడెప్ కు అనుకూలంగా ఉండడంతో ఆమె ఇలా వ్యాఖ్యానించింది. 

‘‘ఒకరు నా గురించి ఏమి ఆలోచిస్తారన్నది నాకు అనవసరం. నా ఇల్లు, వివాహం విషయంలో నాలుగు గోడల మధ్య ఏం జరిగిందన్న దానిపై మీరు ఏమి తీర్పు ఇవ్వాలనుకుంటున్నారో నాకు అవసరం లేదు. సగటు వ్యక్తికి ఈ విషయాలు తెలుసని నేను అనుకోవడం లేదు. కనుక దీన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోవడం లేదు’’ అని హెర్డ్ తన అంతరంగాన్ని బయటపెట్టింది. 

Amber Heard
open
urys verdict
Johnny Depp

More Telugu News