Gopichand: 'జయం' సినిమాకి అందుకున్న పారితోషికం ఎంత తక్కువంటే..!: గోపీచంద్

Gopichand  Interview
  • 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ లో గోపీచంద్
  • ' జయం' సినిమాకి ఇచ్చినది 11 వేలేనని  వెల్లడి 
  •  తాజా సినిమాకి భారీ పారితోషికం అందుకున్నానంటూ వ్యాఖ్య
  • ఈ సారి తప్పకుండా హిట్ ఖాయమంటూ నమ్మకాన్ని వ్యక్తం చేసిన హీరో
'నీ కంటే ముందుగానే విలనిజం  చేసినవాడిని .. చూసినవాడిని' అంటూ 'పక్కా కమర్షియల్' సినిమాలో గోపీచంద్ ఒక డైలాగ్ చెబుతాడు. అది ఆయన గురించి ఆయన చెప్పుకున్న డైలాగ్ గానే అనుకోవాలి. గోపీచంద్ ముందుగా విలన్ గా మెప్పించే ఆ తరువాత హీరోగా నిలదొక్కుకున్నాడు. యాక్షన్ హీరోగానే కాకుండా ఫ్యామిలీ హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. 
 
తాజా ఇంటర్వ్యూ లో గోపీచంద్ మాట్లాడుతూ .. "అందరూ ఆదరించడం వలన .. అభిమానించడం వలన ఈ రోజున ఈ స్థాయి వరకూ వచ్చాను. 'జయం' సినిమాలో విలన్ పాత్రను పోషించినందుకుగాను నేను అందుకున్న పారితోషికం 11 వేలు. ఇక 'పక్కా కమర్షియల్' కోసం నా కెరియర్ లోనే అత్యధిక పారితోషికాన్ని అందుకున్నాను. 

ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ .. కావలసినంత కామెడీ ఉంటాయి. అందువలన ఆడియన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు. అంత గొప్పగా మారుతి ఈ సినిమాను  తీర్చిదిద్దాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది" అంటూ  చెప్పుకొచ్చాడు. జులై 1వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
Gopichand
Jayam Movie
Pakka Commercial Movie

More Telugu News