President Of India: రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Election Commission of India releases president of india election notification

  • నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన ఎన్నికల క‌మిష‌న్‌
  • నేటి నుంచే నామినేష‌న్ల దాఖ‌లు
  • 29 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
  • జులై 18న పోలింగ్‌, 21న ఓట్ల లెక్కింపు

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ బుధ‌వారం సాయంత్రం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. నేటి నుంచి ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నుండ‌గా... 30న నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంది.

నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ముగిసిన వెంట‌నే బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు ఎవ‌రు? ఎందరు అనే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘం అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. రాష్ట్రప‌తి ఎన్నిక‌కు ఒక‌రి కంటే ఎక్కువ మంది బ‌రిలో ఉన్న ప‌క్షంలో జులై 18న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఓట్ల లెక్కింపును జులై 21న చేప‌డ‌తారు. అదే రోజు విజేత‌ను ప్ర‌క‌టిస్తారు.

  • Loading...

More Telugu News