Julian Assange: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఆమోదం

Britain gives nod to extradition of Julian Assange

  • అసాంజేపై గూఢచర్యం ఆరోపణలు
  • ఇరాక్, ఆఫ్ఘన్ యుద్ధాల కీలక పత్రాల లీక్ 
  • అమెరికాకు అప్పగింతపై బ్రిటన్ కోర్టుల్లో కీలక తీర్పులు
  • అసాంజే కౌంటర్ దాఖలు చేసే అవకాశం

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను లీక్ చేసినట్టు వికీలీక్స్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేను అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేశారు. 

అంతకుముందు, అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారం కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టుల వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. జూన్ 17న మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చాయని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఈ కోర్టు తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల సమయం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో, అసాంజే బృందం మరోసారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News