Warangal: కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ మృతదేహంతో భారీ ర్యాలీకి సిద్ధమైన టీఆర్ఎస్

TRS ready to march with rakesh dead body in Narsmpet

  • వరంగల్ ఎంజీఎం నుంచి నర్సంపేటకు మృతదేహం తరలింపు 
  • ఎంజీఎం వద్ద భారీ పోలీసు బందోబస్తు
  • నేడు నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే  

ఆర్మీలో నాలుగేళ్ల ఉద్యోగాలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో యువత నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అది కాస్తా హింసాత్మక రూపు సంతరించుకోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా యువకుడు రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు. నేడు అతని మృతదేహానికి స్వగ్రామమైన నర్సంపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో అంతకంటే ముందు రాకేశ్ మృతదేహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అలాగే, రాకేశ్ మృతిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేడు నర్సంపేట నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు, వరంగల్ ఎంజీఎంలో ఉన్న రాకేశ్ మృతదేహాన్ని నేడు నర్సంపేట తరలించనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

  • Loading...

More Telugu News