Prabhas: ప్రభాస్​ ‘ప్రాజెక్ట్​ కె’ వాయిదా పడలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Producer says shooting of Prabhas Project K movie has not been postponed
  • సెట్స్ లో ఇటీవల హీరోయిన్ దీపికకు అస్వస్థత
  • చికిత్స చేయించుకొని గంటల్లోనే తిరిగొచ్చిన నటి
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
‘మహానటి’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే జంటగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే, ఈ పాన్ ఇండియా చిత్రంపై రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

సినిమా చిత్రీకరణలో భాగంగా ఈ మధ్య హీరోయిన్ దీపికా పదుకొణే అస్వస్థతకు గురైంది. ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడంతో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంది. అప్పటి నుంచి షూటింగ్ వాయిదా పడిందన్న పుకార్లు వస్తున్నాయి. కానీ, వీటిలో నిజం లేదని నిర్మాత అశ్వనీదత్ అన్నారు. షూటింగ్ ఆగిపోలేదని, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అంతా సజావుగానే జరుగుతోందని స్పష్టం చేశారు. 

చికిత్స తర్వాత కొన్ని గంటల్లోనే దీపిక సెట్స్ కు తిరిగొచ్చిందట. ప్రస్తుతం దీపిక, అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని, ఈ నెల 21వ తేదీ నుంచి పది రోజుల షెడ్యూల్ లో ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తోంది.
Prabhas
projectK
Deepika Padukone
nag ashwin
Tollywood
Bollywood
Amitabh Bachchan
pan india
shooting

More Telugu News